'ది లూప్' రీమేక్ లో సాయితేజ్!
- శింబూ తాజా చిత్రంగా 'మానాడు'
- భారీ వసూళ్లను రాబడుతున్న సినిమా
- ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య
- తెలుగు రిలీజ్ లేనట్టే
తమిళంలో భారీ బడ్జెత్ తో నిర్మించిన ఈ సినిమాను, అక్కడ క్రితం నెల 25వ తేదీన రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజున తెలుగులో 'ది లూప్' టైటిల్ తో విడుదల చేయాలనుకున్నారు. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అక్కడ ఆ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది.
తెలుగులో శింబూకి అంతగా మార్కెట్ లేదు. ఆయన సినిమాలు ఇక్కడ అంతగా ఆడింది లేదు. అందువలన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో తెలుగు రిలీజ్ ను ఆపారట. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ఒక బడా నిర్మాత ట్రై చేస్తున్నాడనీ, ఆయన ఈ సినిమాను సాయితేజ్ తో నిర్మించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.