సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'రాధేశ్యామ్' రికార్డు స్థాయిలో రిలీజ్
- విజయ్ సినిమాకు తమన్ మ్యూజిక్
- ఓటీటీకి వచ్చేస్తున్న 'రొమాంటిక్'
* తమిళ సూపర్ స్టార్ విజయ్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడిగా తమన్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
* ఆకాశ్ పూరి, కేతిక శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన 'రొమాంటిక్' చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయింది. మరోపక్క, ఈ నెల 26 నుంచి దీనిని 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి నిర్ణయించారు.