'ఆర్ఆర్ఆర్' నుంచి 'నాటు .. నాటు' సాంగ్ ప్రోమో!
- రాజమౌళి రెడీ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'
- మాస్ బీట్ ను కంపోజ్ చేసిన కీరవాణి
- సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్
- జనవరి 7వ తేదీన సినిమా రిలీజ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. 'నా పాట సూడు .. నా పాట సూడు .. నాటు .. నాటు .. నాటు .. వీరనాటు' అంటూ ఈ పాట సాగుతోంది. ఎన్టీఆర్ - చరణ్ పాత్రలపై ఈ పాటను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.
కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా .. కాలభైరవ - రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. మాస్ బీట్ లో జోరుగా .. హుషారుగా ఈ పాట నడుస్తోంది. కీరవాణి సంగీతంలో ఈ తరహా పాటలు చాలా తక్కువ వచ్చాయనే చెప్పాలి. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.