రేపు 'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- కార్తికేయ హీరోగా 'రాజా విక్రమార్క'
- కథానాయికగా తాన్య రవిచంద్రన్ పరిచయం
- యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల
రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాలో కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించింది. తెలుగులో ఆమె చేస్తోన్న తొలి సినిమా ఇదే. ఈ సినిమాను ఈనెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు.
హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కాస్త కామెడీ .. మరికాస్త రొమాంటిక్ టచ్ ఉన్న యాక్షన్ సినిమా ఇది. కీలకమైన పాత్రల్లో సాయికుమార్ .. తనికెళ్ల భరణి కనిపించనున్నారు. ఈ సినిమాతోనైనా కార్తికేయకు హిట్ పడుతుందేమో చూడాలి.