రేపే 'శ్యామ్ సింగ రాయ్' నుంచి లిరికల్ సాంగ్!
- కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
- డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న నాని
- ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు
- వచ్చేనెల 24వ తేదీన విడుదల
ఈ సినిమాలో నాని కొత్త హెయిర్ స్టయిల్ తో .. మీసకట్టుతో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతిశెట్టి .. మడోన్నా సందడి చేయనున్నారు. మొదటి ఇద్దరు కథానాయికలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.
ఈ సినిమా నుంచి రేపు ఉదయం 11 గంటలకు ఫస్టు లిరికల్ సాంగును విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా గుర్తుచేశారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందనే బలమైన నమ్మకంతో నాని ఉన్నాడు.
.