కౌబోయ్ గెటప్పులో ధనుశ్ ఫస్టు లుక్!
- వరుస సినిమాలతో బిజీగా ధనుశ్
- సెల్వరాఘవన్ తో 'నానే వరువేన్'
- ఈ రోజు మొదలైన రెగ్యులర్ షూటింగ్
- హీరోగా, విలన్ గా ద్విపాత్రాభినయం?
ప్రస్తుతం ఆయన నుంచి ఒకదాని తరువాత ఒకటిగా రావడానికి ఓ అరడజను సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు .. ఆ సినిమా పేరే 'నానే వరువేన్'. ఆయన సోదరుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజున మొదలైంది. ఆ సందర్భంగా ఈ సినిమా నుంచి ధనుశ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కౌబోయ్ గెటప్పులో హంటర్ లా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా .. విలన్ గా ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.