ఓటేసి షూటింగులకు రండి... నటీనటులకు టాలీవుడ్ నిర్మాతల మండలి విజ్ఞప్తి
- ఈ నెల 10న 'మా' ఎన్నికలు
- ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు నిర్మాతల మండలి ప్రకటన
- అధ్యక్ష పదవి బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు
ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకుంటుండడం కాక రేపుతోన్న విషయం తెలిసిందే. మొదట ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఐదుగురు పోటీ చేయాలని భావించారు. చివరకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మాత్రమే ఆ పదవికి పోటీ చేస్తున్నారు.