Allu Arjun: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Pushpa talky part to be completed this week

  • పూర్తవుతున్న 'పుష్ప' టాకీపార్ట్ 
  • 'హరిహర వీరమల్లు' అప్ డేట్ 
  • కొత్త సినిమా మొదలెట్టిన రవితేజ  

*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం టాకీ పార్టీ మొత్తం ఈ వారంలో పూర్తవుతోంది. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి ఉంటుందని అంటున్నారు. ఈ నెలాఖరుకి వీటి చిత్రీకరణ కూడా పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 17న పుష్ప తొలిభాగాన్ని విడుదల చేస్తారు.
*  ప్రస్తుతం 'భీమ్లా నాయక్' చిత్రంలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ చిత్రం షూటింగును ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తారు. ఆ తర్వాత వచ్చే నెలలో 'హరిహర వీరమల్లు' చిత్రం షూటింగులో జాయిన్ అవుతారు. ఇందుకు సంబంధించి షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.
*  రవితేజ తన 69వ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

  • Loading...

More Telugu News