మరో మల్టీస్టారర్ మూవీలో రానా?
- ఒక వైపున రీమేకుల జోరు
- మరో వైపున మల్టీ స్టారర్ ప్రాజెక్టులు
- మైత్రీ బ్యానర్లో రానా - శర్వానంద్
- కొత్త దర్శకుడి పరిచయం
తాజాగా ఈ జాబితాలోకి మరో ఇద్దరు హీరోలు చేరిపోయారు. ఒకరు రానా అయితే మరొకరు శర్వానంద్. ఈ ఇద్దరి కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకూ స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేస్తూ, మైత్రీ కళ్లలో పడిన ఒక యువకుడు, ఈ సినిమాను రూపొందించనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్టు చెబుతున్నారు.