'పుష్ప' నుంచి రానున్న ఫస్టు లుక్ పోస్టర్!
- అడవి నేపథ్యంలో సాగే కథ
- గిరిజన యువతి పాత్రలో రష్మిక
- ముగింపు దశలో చిత్రీకరణ
- 'క్రిస్మస్'కి రిలీజ్ చేసే ఆలోచన
ఇక ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందనే ఒక టాక్ వచ్చింది. ఒక వీడియోలోను ఒక ఫ్రేమ్ లో మెరిసింది. ఇక రేపు ఆమె ఫస్టులుక్ ను వదలడానికి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 9:45 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఒక ప్రకటనను చేశారు.
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన 'దాక్కో దాక్కో మేక' అనే లిరికల్ వీడియో సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంతవరకూ 80 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ఈ సినిమాను 'క్రిస్మస్' కి రిలీజ్ చేయనున్నట్టు చెప్పినప్పటికీ, ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు.
.