'పెళ్లి సందD' నుంచి టీజర్ రిలీజ్!
- రోహన్ హీరోగా 'పెళ్లి సందD'
- కథానాయికగా శ్రీలీల పరిచయం
- ప్రత్యేక పాత్రలో రాఘవేంద్రరావు
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. మాధవి కోవెలమూడి ... శోభు యార్లగడ్డ .. ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించారు. ప్రకాశ్ రాజ్ .. రాజేంద్రప్రసాద్ .. రావు రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ కి మాదిరిగానే ఆయన తనయుడికి కూడా 'పెళ్లి సందD' సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.