సాయితేజ్ ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి: అపోలో వైద్యులు
- రోడ్డుప్రమాదంలో సాయితేజ్ కు బలమైన గాయాలు
- అపోలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
- తాజా బులెటిన్ విడుదల
- సాయితేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
సాయితేజ్ కు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. కీలక అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని, అంతర్గత గాయాలేవీ లేవని ఆ బులెటిన్ లో స్పష్టం చేశారు. ప్రధాన అవయవాల్లో రక్తస్రావం లేదని, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. కాలర్ బోన్ గాయంపై రేపు పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.