అజిత్ హిట్ మూవీ రీమేక్ లో వెంకీ?
- హిట్ కొట్టిన 'ఎన్నై అరిందాల్'
- తెలుగు అనువాదంగా 'ఎంతవాడుగానీ'
- ఇక్కడ కూడా భారీ వసూళ్లు రాబట్టిన సినిమా
- తెలుగు రీమేక్ హక్కులు సురేశ్ బాబు చేతిలో
అయితే మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సురేశ్ బాబు దగ్గర ఉన్నాయట. ఆయన ఈ సినిమాను వెంకటేశ్ హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.
గతంలో గౌతమ్ మీనన్ సినిమా 'కాఖా కాఖా' సినిమా తెలుగు రీమేక్ గా వచ్చిన 'ఘర్షణ'లో వెంకీ నటించాడు. ఈ సినిమా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంది. అందువలన అజిత్ మూవీ రీమేక్ పై కూడా అంచనాలు పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.