విజయ్ దేవరకొండతో సినిమా ఆగిపోలేదన్న శివ నిర్వాణ!
- 'నిన్ను కోరి'తో హిట్
- 'మజిలీ'తో మరింత ఇమేజ్
- రంగంలోకి 'టక్ జగదీష్'
- లైన్లో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు
ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఆయనకి, ఒక ప్రశ్న ఎదురైంది. గతంలో విజయ్ దేవరకొండతో చేయనున్నట్టు ఆయన చెప్పిన వార్తలను గురించిన ప్రశ్న అది. ఆ ప్రాజెక్టు ఆగిపోలేదనీ .. తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని శివ నిర్వాణ సమాధానం ఇచ్చాడు.
శివ నిర్వాణ చెప్పిన కథ నచ్చక పోవడం వలన విజయ్ దేవరకొండ నో చెప్పేసినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదని శివ నిర్వాణ క్లారిటీ ఇవ్వడంతో, ఆ ప్రచారానికి తెరపడింది. ఇక ఈ ఇద్దరూ ఎప్పుడు సెట్స్ పైకి వెళతారా అనేదే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే అంశం.