రష్యాలో 'వలిమై' షూటింగ్!
- అజిత్ తాజా చిత్రంగా 'వలిమై'
- భారీ యాక్షన్ నేపథ్యంలో నడిచే కథ
- పవర్ ఫుల్ విలన్ గా కార్తికేయ
- దీపావళికి భారీ రిలీజ్
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. చివరి షెడ్యూల్ ను 'రష్యా'లో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి అక్కడ కొన్ని రోజుల పాటు షూటింగు జరగనుంది. అజిత్ తో పాటు ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో షూటింగు పార్టు పూర్తవుతుంది.
బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో, అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి కనిపించనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రను కార్తికేయ పోషించాడు. యువన్ శంకర్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. 'దీపావళి' కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.