మహేశ్ తో సినిమా ఉందన్న 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!
- 'అర్జున్ రెడ్డి'తో హిట్టు
- బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు
- మహేశ్ కి వినిపించిన లైన్
- ఇంకా కొలిక్కిరాని కథా చర్చలు
అలాంటి మహేశ్ బాబుకు తాను కథ వినిపించానని ఆ మధ్య 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా చెప్పాడు. ఆ తరువాత ఆ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు లేనట్టేనని అంతా అనుకున్నారు. అందుకు తగినట్టుగా వరుసగా ఆయన హిందీలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.
ఈ నేపథ్యంలో మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా సందీప్ రెడ్డి ఈ ప్రాజెక్టును గురించి ప్రస్తావించాడు. ఈ ప్రాజెక్టు లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. మహేశ్ కి లైన్ నచ్చిందనీ .. చర్చల దశలో కథ ఉందని అన్నాడు. తమ కాంబినేషన్లో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పాడు. అయితే మహేశ్ ఈ ప్రాజెక్టు ఊసెత్తకపోవడమే కొసమెరుపు.