సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రెండు పాత్రలు పోషిస్తున్న ఐశ్వర్య
- ఈ నెల 10తో 'అఖండ' షూట్ పూర్తి
- ధనుష్ సరసన ముగ్గురు నాయికలు
* బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం 'అఖండ' షూటింగు గత కొన్ని రోజులుగా పుదిచ్చేరిలో జరుగుతోంది. ఈ నెల 10వ తేదీతో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.
* తమిళ కథానాయకుడు ధనుష్ తన 44వ చిత్రాన్ని మిత్రన్ జవహర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం.