'ఇష్క్' నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్!
- మరో ప్రేమకథగా 'ఇష్క్ '
- తేజ సజ్జ జోడిగా ప్రియా ప్రకాశ్
- ఈ నెల 30వ తేదీన విడుదల
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్ ను వదిలారు. 'ఆనందం మదికే ..' అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. బ్యూటిఫుల్ విజువల్స్ పై కట్ చేసిన ఈ పాట చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మెలోడీగా దీనిని చెప్పుకోవచ్చు.
ప్రియా ప్రకాశ్ వారియర్ కొంచెం ఒళ్లు చేసినట్టుగా ఉంది .. అయినా ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అవుతున్న రోజునే ఈ సినిమా వస్తుండటం విశేషం. 'జాంబి రెడ్డి'తో హిట్ అందుకున్న తేజ సజ్జ, ఈ సినిమాతోను సక్సెస్ ను సాధిస్తాడేమో చూడాలి.