Suhas: సుహాస్ హీరోగా 'ఫ్యామిలీ డ్రామా' .. ఫస్టులుక్!

- 'కలర్ ఫొటో'తో మంచి క్రేజ్
- హీరోగా మరో ప్రయత్నం
- దర్శకుడిగా మెహర్ తేజ్ పరిచయం
- అజయ్-సంజయ్ సమకూరుస్తున్న సంగీతం
సుహాస్ చిన్నచిన్న పాత్రలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టాడు. అయితే ఆయన హీరోగా చేసిన 'కలర్ ఫొటో' సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో సుహాస్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆయన నటనలోని సహజత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత మళ్లీ తనకి వచ్చిన పాత్రలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిన ఆయన, ఇప్పుడు మళ్లీ హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఆయన హీరోగా చేస్తున్న ఆ సినిమా పేరే ' ఫ్యామిలీ డ్రామా'.
