ద్విపాత్రాభినయం చేయనున్న రామ్ చరణ్?
- శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్
- దిల్ రాజు బ్యానర్లో నిర్మాణం
- రెండు డిఫరెంట్ పాత్రల్లో చరణ్
- త్వరలో షూటింగ్ ప్రారంభం
ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని కూడా అంటున్నారు. అలాగే వివిధ కీలక పాత్రలకు వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను ఎంచుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తాజా విశేషం ఒకటి వినిపిస్తోంది. అదేమిటంటే, ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. రెండు పాత్రలనూ శంకర్ డిఫరెంట్ గా డిజైన్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది.