మరోసారి పూరి .. పవన్ కాంబో సెట్ అవుతున్నట్టే!
- పవన్ క్రేజ్ ను పెంచిన 'బద్రి'
- పూరిని నిలబెట్టిన సినిమా
- పవన్ స్టైల్ ను మరిచిపోని యూత్
- మూడో ప్రాజెక్టు దిశగా సన్నాహాలు
దర్శకుడిగా పూరి జగన్నాథ్ కెరియర్ మొదలైందే పవన్ సినిమాతో. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బద్రి' .. యూత్ లో సృష్టించిన సంచలనం .. అలజడి అంతా ఇంతా కాదు. పవన్ బాడీ లాంగ్వేజ్ ను బయటికి తీసిన సినిమా ఇది. ఆ తరువాత మళ్లీ ఓ పుష్కర కాలానికి 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' చేశారు. కానీ అది ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మూడోసారి ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. హరీశ్ శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత, పవన్ చేసే ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు.