టబు పాత్రలో మనీషా కొయిరాలా!
- హిందీ రీమేక్ గా 'అల వైకుంఠపురములో'
- జంటగా కార్తీక్ ఆర్యన్ .. కృతి సనన్
- దర్శకుడిగా రోహిత్ ధావన్
- ముఖ్యపాత్రలో పరేష్ రావెల్
తెలుగులో టబు చేసిన పాత్రను హిందీలో మనీషా కొయిరాలా చేయనుందని అంటున్నారు. ఇక తెలుగులో టబు తండ్రి పాత్రను పోషించిన సచిన్ కేద్కర్ స్థానంలో పరేష్ రావెల్ ను ఎంపిక చేసుకున్నారు. ఇతర తారాగణం ఎంపిక ప్రక్రియ కొనసాగుతూనే ఉందట. ఈ సినిమాకి 'యువరాజు' అనే అర్థం వచ్చేలా 'షెహ్ జాదా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, అక్కడ ఏ స్థాయి సంచలనానికి తెరతీస్తుందో చూడాలి.