నిర్మాతగా చిరూ కూతురు .. హీరోగా సంతోష్ శోభన్!
- తమిళంలో హిట్ కొట్టిన '8 తొట్టక్కల్'
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
- దర్శకుడిగా శ్రీ గణేశ్
నిర్మాతగా మారాలని నిర్ణయించుకోగానే ఆమె ఆ మధ్య తమిళంలో హిట్ కొట్టిన '8 తొట్టక్కల్' అనే తమిళ సినిమా రీమేక్ హక్కులు తీసుకుంది. తమిళంలో వెట్రి - అపర్ణ బాలమురళి జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీ గణేశ్ దర్శకత్వం వహించాడు. తెలుగు వెర్షన్ కి కూడా ఆయననే దర్శకుడిగా తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో హీరో .. ఓ పోలీస్ ఆఫీసర్. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాలలో మాత్రమే చేస్తూ వచ్చిన సంతోష్ శోభన్, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.