'పుష్ప' విలన్ విషయంలో సుకుమార్ నిర్ణయం!
- షూటింగు దశలో 'పుష్ప'
- రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు
- తెలుగు భాషపై ఫహాద్ కసరత్తు
కానీ సుకుమార్ ఆలోచన వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. సాధ్యమైనంతవరకూ ఫహాద్ ఫాజిల్ తోనే డబ్బింగ్ చెప్పించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడట. అందువలన ఫహాద్ ఫాజిల్ కి చిత్తూరు యాస నేర్పించడానికి తగిన ఏర్పాట్లు చేశాడట. ఫహాద్ ఫాజిల్ కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి భాషపై గట్టిగానే ట్రై చేస్తున్నాడని అంటున్నారు. షూటింగు పూర్తయ్యేసరికి ఫహద్ ఫాజిల్ నేర్చేసుకుంటే ఆయనతోనే డబ్బింగ్ చెప్పిస్తారన్న మాట. లేదంటే మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ ను లైన్లో పెట్టేస్తారని అంటున్నారు.