'వీరమల్లు' సెట్లోకి అడుగుపెట్టనున్న పవన్!
- చారిత్రక నేపథ్యంలో 'వీరమల్లు'
- మొఘల్ కాలంలో నడిచే కథ
- ఆశ్చర్యచకితులను చేసే భారీ సెట్లు
- 'సంక్రాంతి'కి రిలీజ్ చేసే ఆలోచన
తాజా ఇంటర్వ్యూలో నిర్మాత ఎ.ఎమ్.రత్నం మాట్లాడుతూ .. "ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఈ సినిమా షూటింగ్ కొనసాగింది .. ఆ తరువాత కరోనా ఉద్ధృతి కారణంగా ఆగిపోయింది. తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాము. సెట్లో అడుగుపెట్టడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. ఈ షెడ్యూల్లో జాక్విలిన్ .. అర్జున్ రాంపాల్ కూడా పాల్గొంటారు. రాజీవన్ డిజైన్ చేసిన మొఘల్ కాలంనాటి సెట్లు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. 'సంక్రాంతి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము" అని చెప్పుకొచ్చారు.