టైమ్ మెషీన్ లో ముందుకు వెళ్లనున్న ప్రభాస్!
- టైమ్ మెషీన్ ప్రధానంగా సాగే కథ
- 2050 కాలంలోకి కథానాయకుడు
- అప్పటి పరిస్థితులే విజువల్ వండర్
- జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
ఈ సినిమాలో కథానాయకుడు టైమ్ ట్రావెల్ చేస్తాడట. అలా టైమ్ మెషీన్ లో ఆయన 2050 కాలానికి వెళ్లిపోతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు తెరపై చూపించాలనుకోవడం నిజంగానే సాహసం అవుతుంది. అందుకేనేమో ఆయన గ్రాఫిక్స్ కి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ పాన్ ఇండియా సినిమాతో నాగ్ అశ్విన్ ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టిస్తాడో చూడాలి.