ప్రభాస్ ప్రాజెక్టుపై నాగ్ అశ్విన్ కసరత్తు!
- దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి మంచి పేరు
- నిర్మాతగానూ ప్రయోగాలు
- ప్రభాస్ ప్రాజెక్టుపైనే ప్రత్యేక దృష్టి
అయితే తన ప్రాజెక్టు లేట్ అవుతున్నందుకు నాగ్ అశ్విన్ అసంతృప్తికి లోనుకావడం లేదట. స్క్రిప్ట్ పై మరింత శ్రద్ధ పెట్టి, ఒక రేంజ్ లో కసరత్తు చేస్తున్నాడట. ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యాన్ని వర్క్ పరంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నాడని చెబుతున్నారు. ఇక సెట్స్ పైకి వెళ్లిన తరువాత సమయం వృథా కాకుండా .. దేని గురించిన వెతుకులాట లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. ఈ సమయాన్ని ప్రాజెక్టును మరింత స్పీడ్ గా పూర్తి చేయడానికి ఆయన వినియోగించుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు.