త్రివిక్రమ్ ... మహేశ్ మూవీలో శిల్పా శెట్టి?
- త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
- మహేశ్ బాబు జోడీగా పూజ హెగ్డే
- కీలకమైన పాత్ర కోసం శిల్పా శెట్టి పేరు
- త్వరలోనే సెట్స్ పైకి
త్రివిక్రమ్ తన సినిమాల్లో కీలకమైన పాత్రలకు సీనియర్ స్టార్ హీరోయిన్లను తీసుకుంటూ ఉంటాడు. అలా ఆయన సినిమాల్లో నదియా .. ఖుష్బూ .. దేవయాని .. టబూ .. స్నేహా కనిపించారు. ఈ సారి శిల్పా శెట్టిని రంగంలోకి దింపనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో అలరించిన శిల్పా శెట్టి, ఆ తరువాత బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. త్రివిక్రమ్ సినిమాతో మళ్లీ ఇంతకాలానికి ఆమె తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.