ఇక 'సంక్రాంతి' బరిలోనే 'ఆర్ఆర్ఆర్'?
- ముగింపు పనుల్లో 'ఆర్ఆర్ఆర్'
- దసరాకి థియేటర్లకు వెళ్లేది డౌటే
- పెద్ద నిర్మాతలను టెన్షన్ పెడుతున్న కరోనా
అయితే ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా ముగింపు దశలో ఉన్నాయేగానీ పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసే పరిస్థితి లేదు. అందువలన విడుదల తేదీని వాయిదా వేసే విషయంపై దర్శక నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను దసరాకి కాకుండా .. 'సంక్రాంతి' కి విడుదల చేయడమే మంచిదనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. మొత్తానికి కరోనా పెద్ద సినిమాలతో దోబూచులాడుతోంది. ఏ విషయంలోనూ ఎటూ తేల్చుకోనీయకుండా చేస్తోంది.