'అఖండ' ఫస్టు సింగిల్ కి ముహూర్తం ఖరారైనట్టే!
- ముగింపు దశలో 'అఖండ'
- అఘోర పాత్ర ప్రత్యేక ఆకర్షణ
- టీజర్ కి వచ్చిన భారీ స్పందన
- సంగీత దర్శకుడిగా తమన్
ఇందులో బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర అందరిలోనూ కుతూహలాన్ని పెంచుతోంది. ఆ పాత్ర ప్రయోజనం ఏమిటనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో అందరిలో ఏ స్థాయిలో ఆసక్తి ఉందనేది అర్థమవుతోంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ డేట్ లో సినిమానే రిలీజ్ చేయాలని చూశారు. కానీ కరోనా కారణంగా ఏర్పడుతున్న అంతరాయాల వలన షూటింగు పూర్తి కాలేదు. అందువల్లనే ఈ నెల 28న ఫస్టు సింగిల్ ను వదలనున్నారట. తమన్ స్వరపరిచిన ఫస్టు సింగిల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.