కరోనా రావడంతో డెలివరీ చేయలేమన్నారు.. చాలా భయమేసింది: హరితేజ
- వారం రోజుల్లో డెలివరీ అనగా కరోనా వచ్చింది
- ఆ తర్వాత కోవిడ్ సెంటర్లో చేరాను
- పాపను కూడా నాకు దూరంగా ఉంచారు
కరోనా నేపథ్యంలో డెలివరీ చేయడం కుదరదని డాక్టర్లు చెప్పారని... ఆ తర్వాత కోవిడ్ సెంటర్ లో చేరానని హరితేజ తెలిపింది. అయితే తన భర్తకు నెగెటివ్ నిర్ధారణ కావడంతో... ఆయన తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పింది. ఆ తర్వాత సర్జరీ చేసి బేబీని తీశారని... చిన్నారికి నెగెటివ్ రావడంతో తనకు దూరంగా ఉంచారని తెలిపింది. పాపకు పాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని అనుభవించానని చెప్పింది. వీడియో కాల్స్ ద్వారా బేబీని చూసుకునేదాన్నని తెలిపింది. తాను ఎంతో బాధను అనుభవించానని చెప్పింది. దేవుడి దయవల్ల తమ ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపింది.