'మహర్షి' దర్శకుడితో పవన్ కల్యాణ్?
- పవన్ తో దిల్ రాజు ఫస్టు మూవీగా 'వకీల్ సాబ్'
- రెండవ సినిమా కోసం సన్నాహాలు
- వంశీ పైడిపల్లి కథకు దిల్ రాజు ఓకే
దిల్ రాజు కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసిన వంశీ పైడిపల్లి, తాను సిద్ధం చేసిన ఒక కథను వినిపించాడట. ఆ కథ వైవిధ్యభరితంగా అనిపించడంతో, దిల్ రాజు ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ కథను పవన్ కి వినిపించవలసి ఉంది. ఇటీవల కరోనా బారిన పడిన పవన్, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తరువాతనే ఆయన ఈ కథను వినే అవకాశం ఉంది. 'మహర్షి' తరువాత వంశీ పైడిపల్లి చేసే ప్రాజెక్టు ఇదే అయితే బాగానే ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతనే పవన్ మళ్లీ దిల్ రాజుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.