నిద్రమాత్రలు మింగి, చేతి నరాలను కట్ చేసుకున్న మలయాళ నటుడు ఆదిత్య జయన్!
- పలు సీరియల్స్ లో నటించిన ఆదిత్య
- భార్య అంబిలితో ఇటీవల వివాదం
- ప్రస్తుతం విషమంగా ఆరోగ్య పరిస్థితి
ఇటీవల ఆదిత్య జయన్, ఆయన భార్య నటి అంబిలి మధ్య భేదాభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన అంబిలి, భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించగా, ఆదిత్య వాటిని ఖండించాడు. తన ప్రతిష్ఠను దిగజార్చాలని చూస్తున్న ఆమె, వ్యక్తిగత విభేదాలను దృష్టిలో పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు.
వీరిద్దరి మధ్యా ఇలా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆదిత్య ఆత్మహత్యకు ప్రయత్నించడం గమనార్హం. 'సీత' పేరిట నిర్మితమైన ఓ సీరియల్ లో కలసి నటించిన వీరిద్దరూ, 2019లో వివాహం చేసుకోగా, వారికి అర్జున్ అనే కుమారుడు ఉన్నాడు. ఆదిత్య మూడు పెళ్లిళ్ల తరువాత అంబిలిని వివాహం చేసుకోగా, అంబిలి అప్పటికే తన మొదటి భర్తకు దూరంగా గడుపుతూ ఆదిత్యకు దగ్గరైంది. ప్రస్తుతం ఆదిత్య రెండు సీరియల్స్ లో నటిస్తున్నాడు.