ముఖ్యమంత్రి అంటే జగన్ లా ఉండాలి: కోమటిరెడ్డి ప్రశంస
- వెయ్యి దాటే అన్ని వైద్యాలను ఆరోగ్యశ్రీ కిందకు జగన్ తెచ్చారు
- కరోనా చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు
- ఆ పని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు?
తెలంగాణలో కరోనా బారిన పడిన ఎందరో పేషెంట్లు ప్రైవేటు ఆసుపత్రుకు లక్షలు చెల్లిస్తున్నారని... కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తెలంగాణ ప్రభుత్వ ఎందుకు తీసుకురాలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నకిరేకల్ మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాటల మధ్యలో జగన్ ప్రస్తావనను తీసుకొచ్చి, ఆయనపై ప్రశంసలు కురిపించడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.