నయనతారతో 'మాతృదేవోభవ' రీమేక్?
- మరిచిపోలేని సినిమా 'మాతృదేవోభవ'
- రీమేక్ ఆలోచనలో కేఎస్ రామారావు
- నయనతార పైనే ఆయన దృష్టి
"ఈ తరం ప్రేక్షకులకు 'మాతృదేవోభవ' వంటి కథను పరిచయం చేయవలసిన అవసరం ఉంది. అందుకోసం ఆ సినిమాను రీమేక్ చేయాలనిపిస్తూ ఉంటుంది. దర్శకుడు అజయ్ కుమార్ తోను ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూనే ఉంటాను. ఈ తరం కథానాయికలలో నయనతార .. అనుష్క .. కీర్తి సురేశ్ వంటి వారితో ఈ సినిమా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా నయనతార ఈ తరహా పాత్రలను బాగా చేస్తుంది. ఆ పాత్రను ఆమె చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నయనతార తీసుకునే పారితోషికం చాలా ఎక్కువ .. అందువలన ఆమెతో చేయడం కష్టమేనేమో" అని చెప్పుకొచ్చారు. కానీ కథ వింటే నయనతార పారితోషికాన్ని గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.