ఆది - అవికా జోడీగా 'అమరన్' షూటింగ్ ప్రారంభం
- సాయికుమార్ క్లాప్ తో మొదలైన ఆది మూవీ
- వీరభద్రం చౌదరితో రెండో సినిమా
- కథానాయికగా అవికా గోర్
సాయికుమార్ క్లాప్ తో .. ఆదిసాయికుమార్ - అవికా గోర్ పై ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. గతంలో ఆది సాయికుమార్ హీరోగా వీరభద్రం చౌదరి 'చుట్టాలబ్బాయి' సినిమా చేశాడు. ఆ సినిమా ఫరవాలేదనిపించుకుంది. కొంత గ్యాప్ తరువాత అవికా గోర్ వరుసగా తెలుగు సినిమాలు ఒప్పుకుంటోంది. ఇప్పటికే చైతూ జోడీగా 'థాంక్యూ' చేస్తున్న ఆమె, ఆ తరువాత కల్యాణ్ దేవ్ తాజా చిత్రంలో కథానాయికగా కూడా ఎంపిక అయింది. తాజాగా ఈ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందన్న మాట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.