త్రివిక్రమ్ .. మహేశ్ ప్రాజెక్టు మొదలయ్యేది ఆ రోజునే!
- వాయిదాపడిన 'సర్కారువారి పాట' షూటింగ్
- త్రివిక్రమ్ తో సినిమాకి సన్నాహాలు
- మే 31వ తేదీ కోసం అభిమానుల వెయిటింగ్
మరోపక్క, త్రివిక్రమ్ - మహేశ్ బాబు ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ముహూర్తం ఖాయమైపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. అందువలన ఆ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్టు తెలుస్తోంది. ఇక అదే రోజున 'సర్కారువారి పాట' నుంచి మహేశ్ బాబు ఫస్టులుక్ రానుందని అంటున్నారు. మొత్తానికి కృష్ణ పుట్టిన రోజున మహేశ్ బాబు అభిమానులకు రెండు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయన్న మాట.