ఎన్టీఆర్ 30వ చిత్రంపై రేపు అధికారిక అప్ డేట్
- మరో చిత్రానికి ఎన్టీఆర్ సన్నాహాలు
- ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
- దర్శకుడిగా త్రివిక్రమ్, కొరటాల పేర్లు ప్రచారం
- రేపటి ప్రకటనపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి
కాగా ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు', 'చౌడప్ప నాయుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటివరకు ఊహాగానాలే తప్ప ఒక్కటి కూడా అధికారిక సమాచారం లేదు. రేపటి ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నారు.