అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా... పరారైన కూన రవికుమార్!
- పరిషత్ ఎన్నికల రోజున పెనుబర్తిలో వివాదం
- ఫిర్యాదు చేసిన పోలీసులు, బాధితులు
- 60 మందిపై రిజిస్టర్ అయిన కేసు
ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య పెంబర్తిలో ఘర్షణ జరుగగా, ఆపై వైసీపీ నేత, గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై దాడి జరిగింది. అక్కడ ఉన్న పోలీసుల విధులకు కూన ఆటంకం కలిగించారని కూడా కేసు నమోదైంది. ఈ కేసులో కూన సహా మొత్తం 60 మందిపై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, నిన్న కూన ఇంటికి వెళ్లారు. ఆయన కనిపించక పోవడంతో వెనుదిరిగి వెళ్లారు.