సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇన్ స్టాలో దూసుకుపోతున్న సమంత
- వచ్చే నెల నుంచి నాని కొత్త సినిమా
- ఇటలీ నుంచి తిరిగొచ్చేసిన రవితేజ
* ప్రస్తుతం 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో నటిస్తున్న హీరో నాని.. దీని తర్వాత 'అంటే సుందరానికి..' అనే చిత్రంలో నటించనున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ మే నెల నుంచి జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో నజ్రియా ఫహద్ కథానాయికగా నటిస్తుంది.
* రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖిలాడి' చిత్రం షూటింగుకు కరోనా ఎఫెక్ట్ పడింది. ఇటీవల ఈ చిత్రం యూనిట్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది. అయితే, అక్కడ మళ్లీ కరోనా ఎక్కువవడంతో పది రోజుల షూటింగు అనంతరం ప్యాకప్ చెప్పేసి, యూనిట్ హైదరాబాదుకి తిరిగొచ్చేసింది. తదుపరి షూటింగును ఈ నెలలో హైదరాబాదులో ప్రారంభిస్తారని సమాచారం.