హీరోయిన్ నయనతారకు పెట్టిన నిశ్చితార్థ ఉంగరం కనపడేలా ప్రియుడు విఘ్నేశ్ పోస్ట్!
- కొన్నేళ్లుగా నయనతారతో విఘ్నేశ్ ప్రేమాయణం
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర ఫొటో షేర్
- త్వరలో పెళ్లి అని ప్రచారం
తాము ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి సారించి పనులు చేసుకుంటున్నామని చెప్పాడు. అయితే, తాజాగా విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో నయనతార తన చేతిని అతడి గుండెల మీద పెట్టింది. ఆ చేతి వేలికి ఉంగరం ఉంది. అది కనిపించేలా ప్రత్యేకంగా విఘ్నేశ్ ఈ ఫొటోను పోస్ట్ చేశాడు.
దీంతో తమ నిశ్చితార్థం జరిగిందని విఘ్నేశ్ పరోక్షంగా ప్రకటించినట్లయింది. త్వరలోనే వారి పెళ్లి జరగనుందన్న వార్తలు మరోసారి వస్తున్నాయి. కాగా, 2015 నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. గోవాతో పాటు పలు పర్యాటక ప్రదేశాల్లో వారిద్దరు తరుచూ చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం వారిద్దరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. దర్శకుడు విఘ్నేశ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.