పవన్ కల్యాణ్, క్రిష్ సినిమా టైటిల్ ఖరారు.. అధికారిక ప్రకటన!
- క్రిష్ దర్శకత్వంలో పవన్ 27వ చిత్రం
- 'హరి హర వీరమల్లు' అనే టైటిల్ ఖరారు
- ఫస్ట్ లుక్ విడుదల చేసిన యూనిట్
ఈ చిత్రానికి 'హరి హర వీరమల్లు' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో వజ్రాల దొంగగా పవన్ కనిపించనున్నట్టు సమాచారం. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ సరసన యువనటి నిధి అగర్వాల్ నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.