నాని వద్దన్న కథ.. కావాలన్న వైష్ణవ్!
- 'ఉప్పెన'తో వైష్ణవ్ తేజ్ ఘన విజయం
- నాని తిరస్కరించిన కొత్త దర్శకుడి కథ
- వెంటనే ఓకే చెప్పిన 'ఉప్పెన' హీరో
- బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో నిర్మాణం
'ఉప్పెన' సినిమాతో భారీ విజయాన్ని పొందిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా ఓ చిత్రాన్ని అంగీకరించాడు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి వైష్ణవ్ ఓకే చెప్పాడు. దీనికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు. అంతవరకూ బాగానే వుంది. అయితే, ఈ కథ ముందుగా నాని వద్దకు వెళ్లిందట. అయితే, నాని ఈ కథ పట్ల అయిష్టత చూపడంతో వైష్ణవ్ ని సంప్రదించడం.. ఆయన కథ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయట. ఇది యాక్షన్ ప్రధానంగా సాగే కథతో తెరకెక్కుతుంది.