చరణ్, శంకర్ ల సినిమాలో మరో హీరో?
- చరణ్, శంకర్ కాంబోలో భారీ చిత్రం
- దిల్ రాజు బ్యానర్లో 50వ చిత్రం
- నెగటివ్ పాత్రలో మరో స్టార్ హీరో
ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఇప్పుడు మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నాడన్నది ఆ వార్త. అయితే, అతను పోషించేది నెగటివ్ పాత్ర అనీ, కథలో చాలా కీలకమైన పాత్ర అనీ అంటున్నారు. ఆ స్టార్ హీరో ఎంపిక కూడా పూర్తయిందని, అయితే పేరును సస్పెన్సులో వుంచారనీ తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరగడం ఖాయమనే చెప్పచ్చు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్లో నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది.