ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు... సర్వం సిద్ధం
- వివరాలు తెలిపిన గోపాలకృష్ణ ద్వివేది
- ఏకగ్రీవం కాగా మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు
- రెండో దశ పోలింగ్ కోసం 47,492 మంది సిబ్బంది
- పోలింగ్, లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
రెండో దశ ఎన్నికల కోసం 47,492 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు ఉంటుందని, పోలింగ్, లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆయా కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. కొవిడ్ వ్యాధిగ్రస్తులుంటే పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించుకోవాలని ద్వివేది సూచించారు.