Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వాళ్లను చూస్తే కాజల్ జాలిపడుతుందట!  
  • భారీ రేటుకి 'క్రాక్' డిజిటల్ హక్కులు
  • వచ్చే నెల 12న 'ఎఫ్.సి.యు.కె' రిలీజ్
Kajal Agarwal about hypocrisy

*  అబద్ధాలు చెప్పే వాళ్లంటే కథానాయిక కాజల్ కి మహా చిరాకట. 'కొంతమంది అబద్ధాలు చెబుతూ హిపోక్రసీతో ప్రవర్తిస్తుంటారు. ఈ రెండూ వున్న వాళ్లని చూస్తే గతంలో నాకు తెగ కోపం వచ్చేసేది. అయితే, ఇటీవల కాస్త మారాను.. వాళ్లను చూసి కోపం తెచ్చుకోవడం లేదు.. వాళ్ల పరిస్థితికి జాలిపడుతున్నాను" అని చెప్పింది కాజల్.
*  రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్' చిత్రం  సంక్రాంతికి థియేటర్లలో విడుదలై, మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కూడా చేయనున్నారు. ఆహా సంస్థ ఈ చిత్రం డిజిటల్ హక్కులను 8.2 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
*  ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన 'ఎఫ్.సి.యు.కె' (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) చిత్రాన్ని వచ్చే నెల 12న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని దాము నిర్మించగా.. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు.

More Telugu News