మిస్టిక్ థ్రిల్లర్ మూవీలో సాయితేజ్... నేడు కొత్త చిత్రం ప్రారంభం
- జోరుమీదున్న సాయితేజ్
- కార్తీక్ దండు దర్శకత్వంలో కొత్త సినిమా
- హైదరాబాదులో పూజా కార్యక్రమాలు
- క్లాప్ కొట్టిన సాయితేజ్
- స్క్రీన్ ప్లే అందిస్తున్న సుకుమార్
ఇవాళ హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగ్గా, సాయితేజ్ దేవుడి పటాలపై క్లాప్ కొట్టాడు. సాయితేజ్ కెరీర్ లో ఇది 15వ చిత్రం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఎస్వీసీసీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది.