సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌పై ఏంటా కథనాలు?.. టీవీ చానళ్లకు తలంటిన ఎన్‌బీఎస్ఏ
- బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్‌పై ఆరోపణలతో కూడిన కథనాలు
- ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ జీ నెట్‌వర్క్‌కు ఆదేశం
- కథనాలు ప్రసారం చేసేటప్పుడు వాస్తవికతను నిర్ధారించుకోవాలని సూచన
తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గాను రకుల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జీ నెట్‌వర్క్‌కు చెందిన మూడు చానళ్లను ఎన్‌బీఎస్ఏ ఆదేశించింది. ఆ కథనాలకు సంబంధించిన లింకులు యూట్యూబ్‌లో, వెబ్‌సైట్లలో ఉంటే వెంటనే తొలగించి, వారం లోపు తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. కథనాలను ప్రసారం చేయడానికి ముందు వాటి వాస్తవికతను నిర్ధారించుకోవాలని సూచించింది.