ప్రకాశ్ రాజ్ గాంభీర్యం అలా ఉండేది: హీరోయిన్ సాయిపల్లవి
- 'పావకదైగల్' సినిమాలో నటిస్తోన్న సాయిపల్లవి
- కథానాయికకు తండ్రిగా నటిస్తోన్న ప్రకాశ్ రాజ్
- ఆయన తీరు చూసి భయపడేదాన్నన్న సాయిపల్లవి
సాయిపల్లవి వైద్య విద్యను పూర్తి చేసిన విషయం తెలిసిందే. దానిపై ఆమె స్పందిస్తూ... సినిమాల్లో నటించడం పూర్తయ్యాక తాను తప్పకుండా వైద్య వృత్తిపై దృష్టి పెడతానని, దాన్నే కొనసాగిస్తానని చెప్పింది. ఆ వృత్తిపై తనకెంతో గౌరవం ఉందని చెప్పింది. తనకు నాలెడ్జ్ అందించిన వ్యక్తుల్లో ‘ఫిదా’ దర్శకుడు శేఖర్ కమ్ముల ఒకరని, తనకు సూచనలు చేస్తుంటారని తెలిపింది.