ఆ సొరంగ ద్వారం పాక్‌లోనే.. దాయాది భూభాగంలోకి 200 మీటర్లు వెళ్లిన బీఎస్ఎఫ్!
- సొరంగ మార్గాన్ని ఉపయోగించి భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు
- నగ్రోటా వద్ద గత నెలలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
- సాక్ష్యాల కోసం సొరంగంలో వీడియో తీసిన సైన్యం
కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను భగ్నం చేసే లక్ష్యంతో భారత్‌లోకి ప్రవేశించిన జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులను గత నెల 19న జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా వద్ద భద్రతా దళాలు కాల్చి చంపాయి. వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో వారి నుంచి ఆయుధాలు లభ్యం కావడంతో విచారణ చేపట్టిన అధికారులకు సొరంగ మార్గం ద్వారా వారు కశ్మీర్‌లో ప్రవేశించినట్టు తెలిసింది.